భారత్ లో 504కు చేరిన కరోనా కేసులు 

భారత్‌లో  కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం  దేశంలో కరోనా కేసుల సంఖ్య 504కు చేరుకుంది. అంటే గత 24 గంటలలో సుమారు 100 కేసులో కొత్తగా నమోదయ్యాయి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఐదు రోజులలో   ఇది రెండో సారి. కరోనా నియంత్రణకు సంబంధించి ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు, ప్రజల సహకారం కోరుతూ కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఐదు రోజులలో   ఇది రెండో సారి. కరోనా నియంత్రణకు సంబంధించి ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు, ప్రజల సహకారం కోరుతూ కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది.  

 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని  సూచించారు. కాగా, 37 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు. దేశంలో 25 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నారు. 

ఈశాన్య రాష్ట్రాలలో  తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ యువతి ఇటీవలే యూకే నుంచి వచ్చింది. 

మహారాష్ట్రలో అత్యధికంగా ఈ కేసుల సంఖ్య 101కు  చేరుకుంది. కేరళలో 95 కేసులు నమోదయ్యాయి.  కర్ణాటకలో 37, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లలో 33 చొప్పున, ఢిల్లీలో 31 చొప్పున నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటలలో కొత్తగా ఒక కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.  

నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పోలీసులు మూసేశారు. కరోనా కట్టడికి అన్ని  రాష్ట్రాల సీఎంలు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   

కరోనా వైరస్ కట్టడికి దేశంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పాటిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తమకేమీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.. తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. లాక్‌డౌన్‌‌ను ప్రజలు పాటించకుంటే కర్ఫ్యూను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.