భారత్ కు కరోనాను ఎదుర్కొనే అద్భుత సామర్ధ్యం 

నేడు మొత్తం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశానికి అద్భుతమైన సామర్థ్యం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్మాల్-పాక్స్, పోలియో లాంటి రెండు మహమ్మారులను విజయవంతంగా తరిమికొట్టిన అద్భుతమైన అనుభవం ఉన్న భారత్ కరోనాను కూడా నిర్మూలించ కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో ఈ వైరస్ ఎక్కువ కాలంవుండే అవకాశం వుంటుందని హెచ్చరించారు.పెద్ద సంఖ్యలో ల్యాబ్‌లు  చాలా అవసరమని సూచించారు. సులభమైన  పరిష్కారాలు లేనప్పటికీ భారత్  లాంటి దేశాలు ఇంతకుముందు చేసినట్లుగా ప్రపంచానికి మార్గం చూపించడం చాలా ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 3,30,000 దాటింది, మరణాల సంఖ్య 14వేలు దాటింది. అయితే  కరోనా వ్యాప్తిలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను, రక్షణ సూచలను ప్రతీ పౌరుడు తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందని నిపుణులు సూచిస్తున్నారు. 

వేగంగా విస్తురిస్తున్న కరోనాకు  చెక్ పెట్టే చర్యల్లో భాగంగా అమలు  చేస్తున్న లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకొని విధిగా ఆచరించాలని గుర్తు చేస్తున్నారు