తరుచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడమే చిట్కా

తరచూ చేతుల్ని సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవడమే నేడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) సూచించింది. సబ్బు, నీరు అందుబాటులో లేని సమయాల్లో చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్‌ను ఉపయోగించాలని తెలిపింది. చేతుల్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకునే విధానాన్ని ‘డబ్లూహెచ్‌వో’ కింది విధంగా సూచించింది.

రెండు చేతుల్ని నీటితో కడగండి

 1. సరిపడినంత మోతాదులో సబ్బును లేదా హ్యండ్‌ వాష్‌ ద్రవాన్ని  చేతుల్లోకి తీసుకోండి
 2. ద్రవం ఉన్న అరచేతిని మరో అరచేతితో రుద్దండి 
 3. కుడి అరచేతిలో ఉన్న ద్రవాన్ని ఎడమ అరచేతి వెనుక భాగంతోపాటు వేళ్ల మధ్యలో రుద్దండి. ఇదేవిధంగా ఎడమ అరచేతిలో ఉన్న ద్రవాన్ని కుడి అరచేతి వెనుక భాగంతోపాటు వేళ్ల మధ్యలో రుద్దండి
 4. అరచేతిలను ఒకదానికొకటి రుద్దుతూ వేళ్లను కూడా రుద్దుకోవాలి
 5. వేళ్ల వెనుకభాగాన్ని మరో అరచేతిలో ఉన్న ద్రవంతో రుద్దాలి
 6. ఎడమ బొటనవేలును కుడి చేతి పిడికిలిలో చొప్పించి గుండ్రంగా తిప్పుతూ రుద్దాలి. తర్వాత కుడి బొటనవేలుతోనూ చేయాలి
 7. కుడి చేతి మునివేళ్లను ఎడమ అరచేతిపై గుండ్రండా తిప్పుతూ రుద్దాలి. తర్వాత ఎడమ చేతితో చేయాలి.
 8. ఇప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి
 9. ఒకేసారి ఉపయోగించే టవల్‌తో చేతులపై తడిపోయేలా తుడుచుకోవాలి
 10. వాష్‌ బేసిన్‌ నల్లాను కట్టేందుకు చేతులను ఉపయోగించకుండా టవల్‌ను వాడండి
 11. ఇప్పుడు మీ చేతులు క్రిములు లేకుండా సురక్షితంగా ఉన్నాయి