భారత్‌లో 415కు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడం కోసం ఒక వంక దేశ వ్యాప్తంగా దాదాపు సంగం ప్రాంతాలు స్వీయదిగ్బంధనాన్ని పాటిస్తూ ఉండగా, మరోవంక దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 415కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 8కి  చేరుకుంది. 

ఇప్పటి వరకు దేశ వ్యపథంగా 17,493 మంది వ్యక్తుల నుండి 18,383 నమూనాలను పరీక్షించారు. ఇంకా కొంతమంది ప్రజలు ఈ దిగ్బంధనాన్ని తీవ్రంగా పరిగణించక పోవడం పట్ల ప్రధాని నరేందర్ మోదీ అసహనం వ్యక్తం చేశారు. "దయచేసి మిమ్ములను మీరే కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి" అంటూ విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించమని కోరారు. 

లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు విధిగా అమలుపరచాలని, అతిక్రమించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది.ఇప్పుడు 17 రాష్ట్రాలలోని 82 జిల్లాలు పూర్తిగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి.

బ్యాంకులు తమ ఖాతాదారులను ఆన్ లైన్ సేవలు వినియోగించుకోమని ప్రోత్సహిస్తున్నాయి. కేవలం ఎంపిక చేసిన ప్రదేశాలలో కొన్ని బ్రాంచ్ లను మాత్రమే తెరవాలని ఆలోచిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోమని రీజినల్ లేదా జోనల్ లేదా సర్కిల్ మేనేజర్ లకు ఈ విషయమే ఒక నిర్ణయం తీసుకొనే అధికారం ఇచ్చారు. 

ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ మార్చి 31వతేదీ వరకు ఓలా, ఉబర్ క్యాబ్ లను బంద్ చేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి.