27 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరోనా మహమ్మారి కారణంగా ఈ నెలాఖరు వరకు రాష్ట్రం అంతా లాక్ డౌన్ ప్రకటించినా ఈ నెల 27వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సకరోనా మావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 

పరిస్థితులు సానుకూలంగా లేకపోయినప్పటికీ ఈ నెలాఖరు లోగా బడ్జెట్ కు ఆమోదం పొందవలసి ఉన్నందున సమావేశాలు జరపగా తప్పడం లేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 

ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి.  29వ తేదీన శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2020–21 ఆర్థిక ఏడాదికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం నేపథ్యంలో తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీన నెల లేదా రెండు నెలల వ్యయానికి సరిపడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ నుంచి ఆమోదం పొందనున్నారు.