ఒడిశాలోని ఐదు జిల్లాలు లాక్‌డౌన్‌  

ఒడిశాలోని ఐదు జిల్లాలు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. ఖుర్దా, కటక్‌, గంజాం, కేంద్రపారా, అంగుల్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి మార్చి 29వ తేదీ వరకు ఐదు జిల్లాలోని లాక్‌డౌన్‌ ఉంటుంది. 

ఇప్పటికే పూరీ, రూర్కేలా, సంబల్‌పూర్‌, జార్షూగూడ, బాలాసోర్‌, జాజ్‌పూర్‌ రోడ్‌, జాజ్‌పూర్‌ టౌన్‌, భద్రక్‌ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. అత్యవరస సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. వారం క్రితమే రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌, కటక్‌ వంటి పారిశ్రామిక పట్టణాలు మూతపడ్డాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో 40శాతం మూతపడినైట్లెంది.   

రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజేకు కరోనా నెగెటివ్‌గా తేలింది. దీనిపై ఆమె స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాను, తనతో పాటు తన కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ 15 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండనున్నట్లు తెలిపారు.