అమెరికాలో భారతీయులు జాగ్రత్త 

అమెరికాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ఉండే భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వైరస్‌ భారిన పడకుండా, కోవిడ్‌-19 వ్యాధి నుంచి రక్షించుకునేందుకు ఎవరికి వారు స్వీయ నిర్బంధం విధించుకోవాలని సూచించింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఇచ్చే సలహాలను పాటించాల్సిందిగా కోరింది. కోవిడ్‌-19 కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

అమెరికాలో కరోనా నిర్ధారణ కేసులు 21వేలకు చేరుకున్నాయి. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే ప్రతి నలుగురు అమెరికన్లలో ఒకరు ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లే పరిస్థితి ఎంతో దూరంలో లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను అదుపు చేయడంలో ట్రంప్‌ ప్రభుత్వ క్రియా రాహిత్యాన్ని ఇది ఎత్తి చూపుతోంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అమెరికా తీవ్ర ఆంక్ష‌లు జారీ చేసింది.  ఆ దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్ప‌టికే పౌరుల‌కు ఆదేశాలు ఇచ్చాయి.  ఇండ్లు విడిచి బ‌య‌ట‌కు రావొద్దు అని ఆదేశించాయి.  

.కాలిఫోర్నియాతోబాటు న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, ఇలినాయిస్‌ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్థానిక ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. నిత్యావ‌స‌రాల‌కు సంబంధంలేని వ్యాపారాల‌ను మూసివేయాల‌ని న్యూయార్క్ రాష్ట్రం ఆదేశాలు ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల అమెరికాలో 230 మంది చ‌నిపోయారు. సుమారు 20 వేల మందికి సోకింది.  

ఇక ఆ దేశానికి చెందిన మ్యూజిక్ స్టార్ కెన్నీ రోజ‌ర్స్ 81 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూశారు. ఆయ‌న స‌హ‌జ‌మ‌ర‌ణం పొందిన‌ట్లు పేర్కొన్నారు.  అనేక జాన‌ప‌ద గీతాల‌కు ఆయ‌న బాణీలు కూర్చారు. 1970, 80 ద‌శ‌కాల్లో అనేక పాప్ గీతాలు ఆల‌పించారు. మూడుసార్లు గ్రామీ అవార్డులు ఆయ‌న గెలుచుకున్నారు.