పాత ధరలకే మాస్కులు, శానిటైజర్లు 

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, శానిటైజర్లను అత్యవసర వస్తువులుగా గుర్తిస్తూ వాటి ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.నోటిఫికేషన్ విడుదల చేసింది.  

రెండు లేయర్లు, మూడు లేయర్ల మాస్కుల రిటైల్ సేల్ ధరలు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఉన్న ధరలను యథావిధిగా కొనసాగించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2 లేయర్ల మాస్కు ఒకటి రూ.8 దాటడానికి లేదని స్పష్టం చేసింది. మూడు లేయర్ల మాస్కు ఒకటి రూ.10 కంటే ఎక్కువ అమ్మకూడదని తెలిపింది. లేదా ఫిబ్రవరి 12న నాటి ధరలు ఇంకా తక్కువగా ఉంటే ఆ ప్రకారమే అమ్మాలని సూచించింది.

200 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ రూ.100 కంటే ఎక్కువ అమ్మకూడదని కేంద్రం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ 30 వరకు అమలులో ఉంటుందని, ఆ రోజు వరకు ఇవే ధరలతో మాస్కులు, శానిటైజర్లు అమ్మాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం సెక్షన్-3 ప్రకారం కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో మెడికల్‌ డివైజ్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 13,760 కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, క్యాబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. రూ.400 కోట్లతో మెడికల్‌ డివైజ్‌ పార్కుల పథకాన్ని కూడా తెస్తున్నది. 

తద్వారా రాబోయే ఐదేండ్లలో అదనంగా దాదాపు 34వేల ఉద్యోగాలను సృష్టించగలమని, మెడికల్‌ డివైజ్‌ల దిగుమతులనూ తగ్గిస్తామని ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహకాలు పెట్టుబడు లకు ఊతమిస్తాయని ఎలక్ట్రానిక్‌ తయారీదార్ల సంఘం కొనియాడింది. మరోవైపు సీసీఐ, మహారాష్ట్ర స్టేట్‌ కో-ఆపరేటివ్‌ కాటన్‌ గ్రోవర్స్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ల నష్టాల భర్తీకి రూ.1,061 కోట్లను ఇస్తున్నారు.