తెలంగాణలో 10వ తరగతిపరీక్షలు వాయిదా 

తెలంగాణలో గురువారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయమని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఆదేశం ఇచ్చింది. 

విద్యాసంస్థలకు సెలవు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరిపించాలని ముఖ్యమంతి కేసీఆర్ నిర్ణయించారు. 

ఈ విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. రేపు అనగా.. శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరుగుతుందని.. అయితే సోమవారం నుంచి ఈనెల 30వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. 

కాగా.. ఈనెల 29న అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? అనే విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. పలుచోట్ల విద్యార్థులు కరోనా భయంతో పరీక్షలకు హాజరు కావడం లేదని తెలిసింది.