కరొన గురించి భయం వలదు 

కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సరిహద్దు దేశాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేశామని చెప్పారు. 

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్యసేవలు అందిస్తూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత పాంత్రాలకు అనేక సూచనలు ఇస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 22 నుంచి ఇప్పటివరకు 22 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. జనవరి 27 నుంచి రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో పలుసార్లు మాట్లాడుతున్నామని చెప్పారు. 

జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు ప్రారంభించామని, ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేదించామని చెప్పుకొచ్చారు. కరోనా పరీక్షల కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించన్కర్లేదని, ఉచితంగానే టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. 

ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి రాష్ట్రలతో సమావేశం అవుతున్నారు. కరోనా నివారణకు ఇతర దేశాల్లో తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాము. 28 రోజులపాటు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పర్యవేక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 

భూబాగం ద్వారా ఇతర దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు స్రీనింగ్ చేయడానికి 20 చెక్ పోస్టులను పరిమితం చేసి దాని ద్వారానే మన దేశంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.