దేశంలో 4వ క‌రోనా మ‌ర‌ణం

కొన్నివారాల కిందట దేశంలో ఉనికి చాటుకున్న కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 173 కరోనా కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో 25 మంది విదేశీయులు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున 4 మరణాలు సంభవించాయి. 

తాజాగా పంజాబ్ లో 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు నిర్ధారించారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్టు తెలుసుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 42 మంది కరోనా బాధితులను గుర్తించారు. 

తెలంగాణలో 4 కేసులు నమోదు కాగా, వారిలో ఒకరికి నయమైంది. ఏపీలో పాజిటివ్ కేసు ఒక్కటేనని నివేదికలో పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కేరళలో 25 మందికి కరోనా సోకినట్టు తేలింది.  

 కాగా, ఈ నెల 31 వరకు ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెస్టారెంట్లలో భోజనం, టిఫిన్ చేయడంపై నిషేధం విధించామని, అయితే ఆహార పదార్థాలను ఇళ్ళకు తీసుకెళ్ళి తినవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజిర్వాల్ చెప్పారు. 

 సామాజిక కార్యక్రమాల్లో 20 లేదా అంత కన్నా ఎక్కువ మంది పాల్గొనడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, విద్యా సంబంధమైన, సెమినార్లు, సమావేశాలు మొదలైనవాటిలో 20 లేదా అంతకన్నా ఎక్కువ మందిని అనుమతించబోమని స్పష్టం చేశారు.