వారం రోజులు తిరుమలలో ప్ర‌వేశం నిలిపివేత‌

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారం రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామ‌ని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. తిరుమల ఘాట్ రోడ్లు, కళ్యాణకట్ట, అన్న ప్రసాద కేంద్రాలను కూడా మూసి వేస్తున్న‌ట్లు వెల్లడించారు. సిఎం జగన్, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డిలతో సంప్రదించి శ్రీవారి ఆలయంలోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామ‌ని తెలిపారు. 

అయితే ప్రతినిత్యం స్వామివారి నిర్వహించే నిత్య కైంకర్యాలను యథాతధంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించి అనంతరం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తామ‌ని ప్రకటించారు. 

గతంలో 1892లో మాత్రమే శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 128 సంవత్సరాల అనంతరం ఇప్పుడు భక్తులను అనుమతిని రద్దు చేస్తున్నారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చేందిన దయాశంకర్- 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తిరుపతి రూయాకు తరలించిన్నట్లు చెప్పారు. 

ఉత్తర ప్రదేశ్ కు చెందిన 110 మంది భక్తులు తీర్థయాత్రలో భాగంగా అలహాబాద్,  వారణాసి, కోల్‌క‌తా, పూరిల మీదుగా ఒంగోలు చేరుకున్నార‌ని తెలిపారు. ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్లి నిన్న మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. 

ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులందరూ ప్రజా సంక్షేమార్థం టిటిడికి సహకరించాల‌ని సింఘాల్ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు చేసి కళ్యాణాన్ని ఏకాంతంగా ఆలయంలో నిర్వహిస్తామని వెల్లడించారు. 22వ తేది నుండి నిర్వహించనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుటుండటంతో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నామ‌ని, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులపై సమీక్షిస్తోంద‌ని వివరించారు.