జట్ వేగంతో కరోనా నిరోధంలో కేంద్రం

నేడు ప్రపంచాన్ని కలచి వేస్తున్న కోవిడ్ వైరస్ కోవిద్-19 ముప్పుకు ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం జెట్ వేగంతో, విస్తృత స్థాయిలో, ధృడమైన సంకల్పతో అందుబాటులో ఉన్న అన్ని ఉత్తమ పద్దతులను అమలు పరుస్తూ కృషి చేస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్ష వర్ధన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూ లోని అంశాలు:

కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారు?

ఈ పరిష్టితిని అదుపు చేయడం కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పాల్గొనే విధంగా సమగ్రమైన, సమానవ్యంతో కూడిన విధానాన్ని అమలు పరుస్తున్నాము. సన్నాహాలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలను ముందుంచగా మేము జెట్ వేగంతో, మిషన్ మూడ్ లో పనిచేస్తున్నాము. దిగుమతి అవుతున్న కేసుల ప్రభావాన్ని కట్టడి చేయడం కోసం మేము అనేక చర్యలు తీసుకొంటున్నాము. అదే సమయంలో స్థానికంగా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తున్నాము. 

మొదటగా, విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దులు వంటి ప్రవేశ మార్గాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మార్చ్ 4, 2020 నుండి భారత్ కు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణీకులు అందరిని స్క్రీనింగ్ చేయడం ప్రారంభించాము. స్క్రీనింగ్ సమర్ధవంతంగా జరిగేటట్లు చూడడం కోసం అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య నిపుణులను అందుబాటుల ఉంచడంతో పాటు ఐసోలేషన్ ఆసుపత్రులను సహితం అనుబంధంగా ఏర్పాటు చేసాము. 

దేశంలోని 12 ప్రధాన కూడా రేవులతో పాటు అంతగా ప్రాధాన్యత లేని 65 ఓడరేవుల వద్ద కూడా ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తూ చైనా తదితర దేశాల నుండి వస్తున్న ప్రయాణికులు, ఓడల సిబ్బందిని తనిఖీ చేస్తున్నాము. వారిలో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ వార్డ్ లకు పంపుతున్నాము. 

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు  సశాస్త్ర సీమ బల్, ఓడరేవుల అధికారుల సహకారంతో సరిహద్దులలో అన్ని సమగ్ర చెక్ పోస్ట్ ల వద్ద కూడా స్క్రీనింగ్ ప్రారంభించాము. 

కోవిద్-19 ప్రభావంకు గురైన అన్ని ప్రధాన దేశాల నుండి వస్తున్న వారి ప్రయాణ చరిత్రపై కఠినమైన పర్యవేక్షణ ఉంచుతున్నాము. సమగ్ర రోగ నిఘా నెట్ వర్క్ ద్వారా మేము పర్యవేక్షిస్తున్న అటువంటి వ్యక్తుల సంఖ్య మార్చ్ 13, 2020 నాటికి 42,000 మంది ఉన్నారు. వారిని `సమగ్ర నిఘా' పరిధిలోకి తీసుకు వచ్చాము. వారిని ప్రతి రోజు రాష్ట్ర, జిల్లా నిఘా అధికారులు, రాపిడ్ స్పందన బృందాలు పర్యవేక్షిస్తున్నారు. 

మాల్దీవ్స్, మయాన్మార్, బాంగ్లాదేశ్, చైనా, దక్షిణ ఆఫ్రికా, అమెరికా, శ్రీ లంక, నేపాల్, దక్షిణ ఆఫ్రికా, పేరు, మాడగాస్కర్ వంటి 11 దేశాల నుండి వచ్చిన అభ్యర్ధన మేరకు 43 మంది విదేశీయులను ఉహాన్ నుండి, ఐదుగురిని జపాన్ నుడి తరలించాము. 

మన ఆరోగ్య వ్యవస్థలో గల లోపాలను గుర్తించి, సామర్హ్ద్యాన్ని పెంపొందించడం పట్ల దృష్టి సారిస్తున్నాము. ఎపిడెమియాలజీ, నిఘా, ప్రయోగశాల మద్దతు, క్లినికల్మే యాజమాన్యం, నాన్-ఫార్మాస్యూటికల్ జోక్యం, సంక్రమణ నివారణ, రిస్క్ కమ్యూనికేషన్ లలో సామర్ధ్యం పెంపొందింప చేయడం కోసం గత 55 రోజులలో పెద్ద ఎత్తున కృషి చేస్తూ వచ్చాము. సోషల్ మీడియా, ఇతర వేదికలలో తప్పుడు సమాచార ప్రచారాలను, పుకార్లను తిప్పికొడుతున్నాం. 981 అంతర్జాతీయ ఫోన్ కాల్స్ తో పాటు ఇప్పటి వరకు సుమారు 25,000 ఫోన్ కాల్స్ కు (011-23978046) స్పందించాము. 

 

చికిత్సకు, అనుమానిత కేసులను నిర్బంధించడానికి తగినంత సౌకర్యం ఉందా?

తమ వద్ద గల ఐసోలేషన్, క్లిష్టమైన సంరక్షణ సదుపాయాలను అంచనా వేయమని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రులను కోరాము. దేశ వ్యాప్తంగా అవసరమైన ఐసోలేషన్ పడకలు, సరఫరాల సదుపాయాలను అందుబాటులో ఉండేటట్లు చేసాము. నేను ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా సమావేశం జరపగా, వారంతా కూడా తగు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 14,000 దిగ్బంధనా పడకలను గుర్తించాము. మరిన్ని కూడా గుర్తిస్తున్నాము.

కోవిద్ -19 రోగులకు ఎన్ని అదనపు పడకలను సిద్ధం చేశారు?

ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో వివిధ ప్రభుత్వ సదుపాయాలతో 17,500 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవసరం మేరకు అదనపు సదుపాయాలను అందుబాటులోకి తెస్తాము.

మాస్కులు, శానిటైజర్లు వంటి క్లిష్టమైన నివారణ వస్తువుల కొరతను నివారించడానికి ఏమి చేస్తున్నారు?

దేశంలోని ప్రముఖ మాస్కులు, వ్యక్తిగత పరికరాల ఉత్పత్తి దారులను తమ వద్ద గల ఉత్పత్తి సామర్ధ్యం, నిల్వల వివరాలను ఇవ్వమని అడిగాము. ఉత్పత్తిదారుల అందరి వివరాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపాల్ కార్యదర్శులకు ఇచ్చాము. వారు వారిని సంప్రదించి అవసరం మేరకు కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అవసరమైన సరఫరాలు అందుబాటులో ఉన్నాయి. 

చైనా నుండి ఎపిఐ సరఫరాల కొరత ఉండవచ్చనే భయం దృష్ట్యా మందుల అందుబాటు పరిస్థితి ఏ విధంగా ఉంది? 

మందుల రకాలను బట్టి నాలుగు నెలల నుండి తొమ్మిది నెలల వరకు అవసరమైన మందుల నిల్వలు ఉన్నాయి. చైనా హుబెయి రాష్ట్రం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో  ఫిబ్రవరి, 2020 రెండో వారం నుండి తమ మందుల ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించి, మందుల ఉత్పత్తులను ప్రారంభిస్తున్నట్లు మాకు తెలుస్తున్నది. 

కరోనా వైరస్ గురించి ప్రజలలో అవగాహన కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఏమి చేస్తున్నారు?

మేము 117.2 కోట్ల ఎస్ ఎం ఎస్ లను పంపాము. ప్రతి మొబైల్ ఫోన్ లో చేయదగిన, చేయగూడని పనుల గురించి చెప్పిస్తున్నాము. 156 వార్త పత్రికలలో ప్రకటనలు ఇచ్చాము. మైగవ్ ద్వారా ప్రతి వారం 70 లక్షల మందికి సమాచారం పంపుతున్నాము. మరో 20 లక్షల మందికి ప్రకటనలు పంపుతున్నాము. పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో చేయవలసిన, చేయదగని పనుల గురించి ప్రదర్శించమని చెప్పాము. 

గ్రామీణ ప్రాంతాలలో, మేము ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాము. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సికిం, బీహార్ లలోని సరిహద్దు ప్రధానాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఎనిమిది కేంద్ర బృందాలను పంపాము. వారు గ్రామ సభలు, ఇతర సదుపాయాల ద్వారా ప్రజలకు పరిస్థితులను వివరిస్తున్నారు. ప్రమాదంకు అవకాశం గల ప్రజలను సంప్రదిస్తున్నాము. ఇతర చోట్ల గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు జరపడంలో పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకొంటున్నాము. అవగాహన కలిగించడం కోసం జాతీయ విపత్తు యాజమాన్య సంస్థ వనరులను కూడా ఉపయోగించుకొంటున్నాము. 

కోవిద్-19 ని కట్టడి చేసే విషయంలో కేంద్రం రాష్ట్రాలతో ఏ విధంగా సమనవ్య పరుస్తున్నది?

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నెలకొన్న పరిస్థితుల గురించి, వారి సంసిద్ధత గురించి ప్రతిరోజూ సమీక్ష జరుపుతున్నాము. కేంద్ర ఆరోగ్య కార్యదర్శితో పాటు నేను తరచూ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు జరుపుతున్నాము. హోలీ రోజున (మార్చ్10) కరోనా వైరస్ ప్రభావం గల రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను పిలిచి రోగుల పరిస్థితులు, తగు వనరుల విషయంలో సమస్యల గురించి చర్చించాను. 

ఈ రోగానికి మీకు తగిన పరీక్షా సదుపాయాలు ఉన్నాయా?

పూణే లోని ఎన్ఐవి నోడెల్ ప్రయోగశాల. క్లినికల్ నమూనాల సేకరణ, పరీక్షా సదుపాయాలను దేశంలో 52 ప్రయోగశాలలో ఏర్పర్చాము. నమూనాల సేకరణ కేంద్రాలుగా 57 ప్రయోగశాలలు గుర్తించాము. ఈ నెట్ వర్క్ ను మరింతగా విస్తరిస్తున్నాము.