కేసీఆర్, ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేదో తెలుస్తా

కేసీఆర్, ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేదో  రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్  స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

ఆ తర్వాత ఆయన గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగీస్తూ  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, మూడేళ్లలో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని  భరోసా వ్యక్తం చేసారు. 

బంగారు తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్ మానవత్వం లేని ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ యువకుల ఆత్మత్యాగాలు, రక్తపుమడుగు పైనా కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, ఆ యువకుల శక్తితోనే ఆయన్ని గద్దె దించుతామని, గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్, ఎంఐఎం ఒవైసీ కలిసి అరాచకపాలన చేస్తున్నారని, వీళ్ల విధ్వంస రాజకీయాలను దెబ్బకొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని సంజయ్ మండిపడ్డాయిరు. ధర్మ రక్షణ, సమాజం మేలు, పేద ప్రజల బాగు కోసం తాను పోరాడుతానని స్పష్టం చేసారు.   

 జాతీయ వాదమే ఊపిరిగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం పార్టీ గొప్పదనమని, ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని చెప్పారు. తెలంగాణలో జాతీయ తెలిపారు. 

దేశ భక్తి, హిందుత్వానికి ప్రస్తుతం సంకట స్థితి నెలకొందని పేర్కొంటూ అధికార పార్టీతో కలిసి ఎంఐఎం లాంటి దేశ ద్రోహులు అరాచకాలకు పాల్పడుతున్న సమయంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ప్రజలు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ భాద్యతలు చేపట్టిన తాను కార్యకర్తలందరినీ కలుపుకొని టీఆర్ఎస్ను గద్దె దించడానికి పోరాడుతానని హామీ ఇచ్చారు.