విశాఖలో కన్నా భూమి పైనే కబ్జాదారుల కన్ను!

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించాక అక్కడ భూ కబ్జాలు పెరిగిపోయానని, సాక్షాత్తూ తన భూమినే కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాపోయారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పాడ్డాయని మీడియా సమావేశంలో కన్నా ఆరోపించారు. 

వైజాగ్‌లో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని, తమ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని, తుపాకీ గురిపెట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. 

‘‘భీమిలి సమీపంలో స్వయంగా నా స్థలానే కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. 1993లో చేపలుప్పాడలో నేను స్థలం కొనుకున్నాను. పక్కనే ఉన్న పోలీసు అధికారి స్థలం కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసి ఆ పోలీసు అధికారి నాకు ఫోన్ చేసి అలెర్ట్ చేశారు. భూ మాఫియా గ్యాంగే నా స్థలం కబ్జాకు ప్రయత్నించింది" అని వెల్లడించారు. 

"వైజాగ్‌లో భూ మాఫియాకు వందల మంది బాధితులయ్యారు. నా భూమికి కూడా కంచె వేశారు. అదేంటని అడిగితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అని అనుకోలేదని నిందితులు చెబుతున్నారు.’’ అంటూ జరిగిన విషయాన్ని మీడియాకు కన్నా వివరించారు.

విశాఖ ప్రజలు మూడు రాజధానులు అనగానే భయపడుతున్నారని కన్నా తెలిపారు. రాజధానిని మీరే కాపాడలని విజయనగం ప్రజలు తనతో అన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పిస్తామననే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామని, కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ, జనసేన కూటమిని ప్రజలు ఆదరిస్తారని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.