బెంగాల్ లో మాదే అధికారం 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతను ఓడించడానికి ఒక్క యేడాదిలో సర్వ శక్తులనూ కూడగట్టుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించడానికి రంగంలోకి దిగామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

అంతేకాకుండా 2021 లో అస్సాంలో జరగబోయే ఎన్నికల్లో కూడా తిరిగి విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ హయాంలో అస్సాంను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించామని, కేంద్రం కూడా అందుకు పూర్తిగా సహకారం అందించిందని రామ్‌మాధవ్ ప్రకటించారు.