కరోనా వైరస్‌ వ్యాప్తికి ట్రంప్‌ సర్కారే కారణం

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడానికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలే కారణమని ఇద్దరు శాస్త్రవేత్తలు తప్పు పట్టారు. కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 14కి చేరుకున్న నేపథ్యంలో ఇల్లినాయిస్‌, బేయలర్‌ యూనివర్శిటీలకు చెందిన ఆ ఇద్దరు శాస్త్రవేత్తల వ్యాఖ్యలు వెలువడ్డాయి. 

కార్మికులు, నర్సింగ్‌ హోమ్‌ల్లోని వృద్ధులైన రోగులు ప్రధానంగా ఈ ముప్పుకు లోనవుతున్నారని, వారిలో వృద్ధులు ఎక్కువగా మరణిస్తున్నారని ప్రభుత్వ డేటా తెలియచేసింది. కొద్ది నెలల్లోనే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను మందుల కంపెనీలు తయారు చేస్తాయని ట్రంప్‌ చెబుతున్నారు కానీ దానికి విరుద్ధంగా మందుల కంపెనీల సిఇఓల మాట్లాడుతున్నారని ధ్వమజెత్తారు. 

పైగా ఈ వైరస్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సమన్వయం చేసుకుంటారని ట్రంప్‌ చెప్పారు. కరోనా వైరస్‌ను పరీక్షించే కిట్‌లు తగినన్ని అమెరికాలో లేవని పెన్స్‌ అంగీకరించారు కానీ ట్రంప్‌ అంగీకరించడం లేదు. వ్యాక్సిన్‌ అభివృధ్ధికి 250కోట్ల డాలర్లను కేటాయించాలని ట్రంప్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ను కోరారు. 

దానికి మూడు రెట్లు మొత్తాన్ని ఎంపీలు ఆమోదించినా అదనపు మొత్తం ఈ ఏడాది అక్టోబరు 1 నుండి అమల్లోకి వస్తుంది.పైగా శాస్త్ర పరిశోధన, వ్యయంలో 9శాతం కోత విధించాలని ట్రంప్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రజారోగ్య నిధులపై ట్రంప్‌ ప్రభుత్వం కోత విధించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.