తాజ్‌మహల్‌‌ మూయమని కోరిన ఆగ్రా మేయర్ 

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌‌తోపాటు ఇతర పురాతన కట్టడాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

 ‘‘తాజ్‌మహల్‌‌ను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రా నగరానికి వస్తున్నారు, దీనివల్ల ఆగ్రా నగరంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తాజ్‌మహల్‌‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేసి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు.

కాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజ్‌మహల్‌ ను చూసేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా, వారిలో 708 మందిని హోంఐసోలేషన్ కు తరలించారు. 

ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆగ్రా వైద్యాధికారులు చెప్పారు.