కరోనా భయం వలదు....అలవాట్లు మార్చుకొంటే సరే 

సర్వత్రా కరోనా భయం ఆవహిస్తుంది. ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. అయితే భయం వదిలి జీవన పద్దతులలో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సనాతన భారతీయ జీవన విధానం ఇటువంటి వైరస్ లకు విరుగుడుగా నేడు ప్రపంచం గుర్తిస్తున్నది. 

నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు కరోనా వైరస్ పేరుతో ఖంగారు పడుతున్నారు. జన జీవనం స్తంభించి పోతున్నది. అయితే అలజడి అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.

-కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది. ఇది వస్త్రాలపై 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.  ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.

కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చని యూనిసెఫ్ తెలిపింది.


ఇక, “షేక్ హ్యాండ్” అనే పాశ్చాత్య  పద్దతిని కొన్ని రోజులు ప్రక్కన పెట్టాలని నేడు ప్రపంచంలో అనేక ప్రభుత్వాలే ప్రజలకి సూచనలిస్తున్నాయి. దూరం నుండే నమస్కారం తో ఎదుటి వ్యక్తిని మనః పూర్వకంగా గౌరవించటం భారతీయ సాంప్రదాయం.

ఎక్కడెక్కడో పెట్టిన చేతులతో చేతులు కలపటం, మూతుల్లో మూతులు పెట్టుకుని ముద్దులు పెట్టుకోవటం వంటివి చేస్తే, రోగాలు రాకపోతే ఇంకేమి వస్తాయి... ?

ఇంటి ముందు ఆవుపేడతో కల్లాపు చల్లటం, గుమ్మానికి పసుపు రాయటం, గుమ్మానికి ఆకులతో తోరణం కట్టటం, ఇంట్లో తులసి మొక్క పెంచటం, బియ్యం పిండి తో ముగ్గు వేయటం, ముఖానికి పసుపు వ్రాసుకోవటం వంటి విలక్షణమైన జీవన పద్దతులను మరచిపోతున్నాము . 

 ప్రాచీన పద్దతుల్లో చెప్పినట్లు తయారు చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం (బొట్టు బిళ్ళలు/స్టిక్కర్ లు కాదు), వంటికి గానుగ నూని వ్రాసుకుని, నలుగు పిండి, కుంకుడు, శీకాకాయ లతో స్నానం చేయటం, యోగాసనాలు ఇలా అనేకమైన విషయాలు భారతీయ జీవన విధానంలో భాగంగా ఉండేవి.