చంద్రబాబు విధానాలనే అనుసరిస్తున్న జగన్ 

మాజీ సీఎం చంద్రబాబునాయుడు విధానాలనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అవలంభిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శించారు. నాడు టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్ పోర్టులోనే ప్రతపక్ష నేత జగన్ ని నిర్బంధించారని గుర్తుచేశారు. 

ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేత జగన్ పై, కేంద్ర ప్రభుత్వంపై, మోదీని అవహేళన చేసేలా చంద్రబాబు మాట్లాడారని పేర్కొన్నారు. 

ఈ రోజున అదే దారిలో జగన్ పయనిస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమౌతోందని ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ అవన్నీమర్చిపోయి అదే పోకడ పోతున్నారని హెచ్చరించారు.