తెలంగాణాలో విద్యుత్ చార్జీల వడ్డన

తెలంగాణలో విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమైంది. డొమెస్టిక్‌ , కమర్షియల్‌ , ఇండస్ట్రియల్‌ కేటగిరీల చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్‌‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. చార్జీల టారిఫ్‌ ను శనివారం విద్యుత్‌‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు సమాచారం. 

విద్యుత్‌‌ అధికారులతో కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.  విద్యుత్‌‌ సంస్థలకు ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్సిడీని ఈ సారి రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు 19 పైసల లోటు ఉందని, ప్రభుత్వ సబ్సిడీతో డిస్కమ్‌లు నెట్టుకురాలేవని అధికారులు స్పష్టం చేశారు. డిస్కమ్‌లు వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13,647 కోట్ల దాకా బకాయి ఉన్నాయని కేసీఆర్‌కు నివేదించారు.

ప్రజా ప్రయోజనాల కోసమే సాగు నీటి ప్రాజెక్టులను వాడుతున్నందున కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడే విద్యుత్‌‌ టారిఫ్‌ పెంచకుండా పబ్లిక్‌ యుటిలిటీ కేటగిరీలో చూపించాలకునేందుకు సీఎం అంగీకరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేశారు.