రోహింగ్యాలకు ఆధార్‌ కార్డులపై లక్ష్మణ్ ఫిర్యాదు 

రోహింగ్యాలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా కె లక్ష్మణ్  రాష్ట్ర  డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 180 మంది రోహింగ్యాల కు ఆధార్, ఓటర్, ఇతర గుర్తింపు కార్డులు ఎలా ఇచ్చారు? అనే విషయంపై పోలీసులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 

అందుకు కారకులెవరనే విషయాన్ని పోలీసులు గుర్తించాలని కోరుతూ ఈ దేశం కానీ వాళ్ళు గుర్తింపు కార్డులు తీసుకుంటుంటే… పోలీసులు  ప్రేక్షక పాత్ర పోషిస్తున్నరా? అని ప్రశ్నించారు. 

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ కోసం చర్యలు తీసుకుంటుంటే టి ఆర్ ఎస్ పార్టీ అండతో ఎంఐఎం  పార్టీ మాత్రం వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని  విమర్శించారు.  అక్రమంగా రోహింగ్యాలు ఆధార్ తీసుకుంటే… మజ్లిస్ పార్టీ నేత అసదుద్ధీన్ ఓవైసీ వాళ్ళకి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

ఈ దేశం కానీ వాళ్ళు గుర్తింపు కార్డులు తీసుకుంటుంటే… పోలీసులు  ప్రేక్షక పాత్ర పోషిస్తున్నరా?అని అడిగారు. ట్విట్టర్ పోస్ట్ లకు స్పందించే కేటీఆర్ ఓవసీ ట్విట్టర్ కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ.. అక్రమంగా ఆధార్ కార్డులు పొందిన వారు దొరికితే…. ప్రభుత్వం వారిని అల్లుళ్ళ మాదిరిగా  మేపుతుందని దుయ్యబట్టారు. 

ఎంఐఎం పార్టీ అనే పాముకు ప్రభుత్వం పాలు పోసి  పెంచుతుందని, అది ఏదో ఒకరోజు నాగు పాములా కేసీఆర్, కేటీఆర్ లను కాటు వేస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు.