మార్చ్ 15న హైదరాబాద్ లో అమిత్ షా బహిరంగ సభ 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 15వ తేదీన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అన్ని అనుమానాలను అమిత్ షా నివృత్తి చేస్తారని ఆయన తెలిపారు. సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. 

ఎంఐఎంతో చెట్టాపటాలువేసుకుంటున్న టీఆర్‌ఎస్ సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని లక్ష్మణ్ విమర్శించారు. ఈ రెండు పార్టీలూ కలిపి సీఏఏ , ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 

వాస్తవాలను బీజేపీ ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోందని, అయితే ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకే అమిత్ షా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.