కరోనా వైరస్ పేరు ‘కోవిడ్-19’ సూచించిన భారతీయ డాక్టర్ 

ప్రాణాంతక కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్ 19’ అనే కొత్త పేరును అధికారికంగా నిర్ణయించినట్టు ప్రకటించింది. సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్  ఈ విషయం వెల్లడించారు. కొ అంటే కరోనా, వి అంటే వైరస్, డి అంటే డిసీజ్‌గా కొత్త పేరులోని అక్షరాలను వివరించారు. 19 అంటే 2019లో ఆ వ్యాధి పుట్టింద‌ని అర్థం.  

అయితే ఆ వైర‌స్‌కు నామ‌క‌ర‌ణం చేసింది మాత్రం మ‌న భార‌తీయ డాక్ట‌రే.  ఆ డాక్ట‌ర్ పేరు సౌమ్యా స్వామినాథ‌న్‌. డ‌బ్ల్యూహెచ్‌వోలో ఆమె చీఫ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. వ్యాధుల‌కు పేరు పెట్టాలంటే కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే క‌రోనా వైర‌స్‌కు కోవిద్‌-19 అని పేరు పెట్టిన‌ట్లు డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు.

వ్యాధికి పేరు పెట్టిన‌ప్పుడు .. ఆ వ్యాధి పేరు ఓ ప్రాంతాన్ని కానీ, న‌గ‌రాన్ని కానీ సూచించ‌కుండా ఉండాలి. వ్యాధి పేరు కూడా ప‌ల‌క‌డానికి ఈజీగా ఉండాలి. క‌న్ఫూజ‌న్ ఉండకూడ‌దు, కానీ లాజిక్ మిస్ కావొద్దు. భ‌విష్య‌త్తు త‌రాలు తెలుసుకునే ర‌కంగా వ్యాధి పేరు ఉండాలి. 

క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే మిగ‌తా వ్యాధుల‌కు కూడా పెరు పెట్టేంత సులువుగా ఉండాల‌ని డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ పేర్కొన్నారు. హరిత‌విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురే డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్‌.  

హుబాయ్ ప్రావిన్సులో విష‌పూరిత వైర‌స్ వ‌ల్ల బుధ‌వారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్న‌ది.  క‌రోనా వైర‌స్ బారిన ప‌డి.. ఆ త‌ర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్న‌ది.  ప్ర‌స్తుతం సుమారు 34 వేల మంది కోవిద్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న‌ట్లు చైనా వార్త సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి.