కరొనతో ‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతం 

కరోనా వైరస్ చైనాలో విజృభించడం ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను భారతీయ వ్యాపారవేత్తలకు దోహదం చేసే అవకాశాలున్నాయి. కరోన వైరస్ కారణంగా చైనా నుండి అనేక ఉత్పత్తుల దిగుమతిని అకస్మాత్తుగా నిషేధించాల్సి వచ్చింది. దీంతో దేశీయ కంపెనీలు తమ వస్తువుల ఉత్పత్తిని పెంచాయి. 

ఉదాహరణకు వైద్య రంగంలో ఇప్పటివరకు శస్త్రచికిత్స వస్తువులు, చైనా నుండి వచ్చే గ్లోబ్స్‌తో సహా డజన్ల కొద్దీ ఉత్పత్తులు ఎక్కువగా భారత్‌లో వినియోగిస్తున్నాం. అయితే చైనా నుండి వస్తువులు ఆగిపోవడంతో స్థానిక కంపెనీలే తమ ఉత్పత్తిని పెంచాయి.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చైనా అన్ని చర్యలు తీసుకుంటుంటోంది. అయితే ఇది ఒక్కసారిగా తొలగిపోవడం సాధ్యం కాదని, దీనికి చాలా సమయం పడుతుందని ఉత్తరప్రదేశ్ కెమిస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సైనీ పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి చైనాకు సమయం పడుతుంది. 

స్థానిక కంపెనీలు దీనిని అర్థం చేసుకున్నాయి. దీంతో చాలా వస్తువుల ఉత్పత్తిని ప్రారంభించాయి. స్వదేశీ కంపెనీలు తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి సమయంగా భావిస్తున్నాయి.

చైనా నుండి దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ గృహోపకరణాలు, బొమ్మలు నిలిచిపోయాయి. హోలీ దగ్గరలో ఉందని, చైనా నుంచి సరుకులు మధ్యలో చిక్కుకున్నాయని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. మార్కెట్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడకుండా ఇప్పుడు దేశీయ కంపెనీల ఉత్పత్తులు పెంచాల్సి ఉంటుంది. అన్ని స్వదేశీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. దిగుమతిదారులందరూ ఉత్పత్తుల కోసం ఆర్డర్లు తగ్గించారు. 

చైనా నుండి డజన్ల కొద్దీ రసాయన దిగుమతులు ఉన్నాయని రసాయన వ్యాపారవేత్త రాజేంద్ర అగర్వాల్ తెలిపారు. చైనా నుండి దిగుమతులు నిలిచిపోవడంతో మరో ముప్పు కూడా ఉంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని దేశీయ కంపెనీలు వస్తువుల ధరలను పెంచే అవకాశం కూడా ఉంది. అయితే చైనా కంపెనీలు తిరిగి ప్రారంభమైన తర్వాత దిగుమతులను నియంత్రించడం ప్రభుత్వ మీదే ఆధారపడి ఉంటుంది.