బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

హైదరాబాద్ నగరంలోని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే పార్టీ రాష్ట అద్యక్షుడు డా. కే లక్ష్మణ్ కు రాజీనామా లేఖ పంపినట్లు ప్రకటించారు.

.తాను చేపట్టిన గో రక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను గో రక్షణ కోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేసారు.  తన ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బంది రాకూడదనే కారణంతోనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ వచ్చాక యథేచ్చగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. గోవుల అక్రమ రవాణను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గోవుల అక‍్రమ రవాణా జరుగుతుంటే రవాణా మంత్రి ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెబుతూ గోవధను ప్రభుత్వం అరికట్టాలని రాజాసింగ్‌ డిమాండ్ చేశారు.