బీహార్ లో చెక్కు చెదరని నితీష్ ప్రజాదరణ !

బీహార్ లో తిరిగి బిజెపితో చేరినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల ప్రజాదరణ మాత్రం అట్లాగే కొనసాగుతున్నది. రాష్ట్రంలో ప్రజాదరణ విషయంలో మరే నాయకుడు ఆయనకు సమీపంలో లేరు. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్ చేంజ్ సర్వే వెల్లడి చేస్తున్నది. ఆర్ జే డి తో తెగతెంపులు చేసుకొని, బిజెపితో చేరినప్పటి నుండి రాష్ట్రంలో అవినీతి సహితం తగ్గుముఖం పట్టిన్నట్లు గణనీయ సంఖ్యలో ప్రజలు భావిస్తున్నారు.

ఆర్ జే డి తో తెగతెంపులు చేసుకొని తిరిగి బిజెపితో చేరిన తర్వాత కూడా ఆయన పట్ల ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని 56 శాతం మంది పేర్కొన్నారు. కేవలం 35 శాతం మంది మాత్రమె ఆయన పట్ల ఆదరణ తగ్గిన్నట్లు భావిస్తున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరు పట్ల 35 శాతం మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆర్ జే డి – కాంగ్రెస్ లతో పోత్తు తెంచుకున్న తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గుముఖం పట్టిన్నట్లు 49 శాతం మంది భావిస్తున్నారు. 40 శాతం మంది మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

తర్వాత కుడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని 46 శాతం మంది కోరుకొంటూ ఉండగా, ప్రతిపక్ష నేత తెజశ్వి యాదవ్ కు 28 శాతం మంది మాత్రమె మద్దతు తెలిపారు.

కాగా, దేశం అంతా ప్రతిపక్షాలు అలజడి సృష్టిస్తున్న రాఫెల్ ఒప్పందం గురించి ఆశ్చర్యకరంగా 76 శాతం మంది అసలు పట్టించుకోవడం లేదు. రాఫేల్ యుద్ద విమానాల ధరను కేంద్ర ప్రభుత్వం బహిరంగ పరచరాదని 62 శాతం మంది చెబుతున్నారు.

తర్వాతి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ కావాలని 58 శాతం మంది కోరుకొంటున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని 46 శాతం మంది మాత్రమె కోరుకోవడం గమనార్హం. కేవలం 32 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకొంటున్నారు.

ఇక, ప్రజల ముందున్న ప్రధాన సమస్యలలో పరిశుభ్రత, నిరుద్యోగం, త్రాగు నీరు ముఖ్యంగా ఉన్నాయి. రాష్ట్రంలో గల మొత్తం 40 నియోజక వర్గాలలో కుడా 15,375 మందిని టెలిఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఈ సర్వే చేసారు. 2015 లో `మహాకుటమి’ ఘన విజయం సాధించిన తర్వాత మరో పర్యాయం ఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే గత ఏడాది ఆ కూటమికి స్వస్తి పలికి బిజెపితో మారు పొత్తు ఏర్పరచుకున్నారు.