భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

చైనాలో కరోనా వైరస్ ప్రపంచ వాణిజ్య మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ లోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చైనా నుంచి ఉత్పత్తయ్యే సీ ఫుడ్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. చైనీస్ ఫుడ్ వల్లే కరోనా వస్తుందనే  ప్రచారం జరుగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. మొబైల్స్ , వాహనాలు చివరకు చైనా ఆటబొమ్మలను కూడా కొనేందుకు జంకుతిన్నారు పబ్లిక్. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పపటి నుంచి చైనా నుంచి ఇండియాకు దిగుమతులు ఆగిపోయాయి. మన దేశంలో పండే మిర్చి, ఇతర పంటల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.  

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్.. మరో 26 దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 500కు చేరింది. ఇందులో చైనాలో చనిపోయిన వారే 492 మంది ఉన్నారు. చైనాలో ఇప్పటివరకు 24 వేల మందికి పైగా వైరస్ సోకిందని నిర్ధారించారు. వీరిలో 5 వందల మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.  

వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న మరో లక్షా 71 వేల మందిని అబ్జర్వేషన్ లో ఉంచారు చైనా అధికారులు. కరోనా వైరస్ సోకిన వారు లక్షల్లో ఉండవచ్చని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అప్పుడే పుట్టిన చిన్నారికి వైరస్ సోకినట్టు గుర్తించారు. డెలివరీకి ముందు ఆమె తల్లికి కరోనా ఉన్నట్టు తేల్చారు నిపుణులు.

బీజింగ్ లోనూ రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వుహాన్ లో వెయ్యి పడకల హాస్పిటల్ ను 10 రోజుల్లో నిర్మించిన చైనా సర్కార్… తాజాగా 13 వందల పడకలున్న మరో హాస్పిటల్ ను నిర్మిస్తోంది. కరోనా వైరస్ తో చైనా సరిహద్దు దేశాలు అలర్టయ్యాయి. నార్త్ కొరియా, రష్యా, మంగోలియా దేశాలు చైనాతో తమ బార్డర్ ను క్లోజ్ చేశాయి. 12 నగరాలు కరోనా వైరస్ భారిన పడటంతో.. ఆ ప్రాంతాలకు ట్రావెల్ బ్యాన్ విధించింది చైనా.