సోమనాథ్‌ చటర్జీ ఆరోగ్యం విషమం

లోక్‌సభ మాజీ స్పీకర్‌, సీపీఎం సీనియర్‌ నేత సోమనాథ్‌ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమం​గా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయనను కోల్‌కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సోమ్‌నాథ్‌కు డయాలసిస్‌ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నామని ఆదివారం వైద్యులు పేర్కొన్నారు. బెంగాల్‌ నుంచి సీపీఎం తరుఫున పదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. 

ఆయన 1971 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సీపీఎంలో చేరిన సోమనాథ్‌ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. అయితే 2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటీకి స్పీకర్‌గా రాజీనామా చేయడానికి నిరాకరించడంతో సిపియం నుండి ఆయనను బహిష్కరించారు.