కరోనా వైరస్ భారత్ పై సంధించబోయిన జీవాయుధం? 

నేడు ప్రపంచం అంత అఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ భారత్ పై  మారణాయుధంగా చైనా ప్రయోగింప దలచిన జీవాయుధం బెడిసి కొట్టండంతో జరిగిన ప్రమాదమా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ వైరస్ సీఫుడ్ మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. కానీ చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) బెడిసికొట్టి.. ఆ దేశాన్నే కాటేస్తున్నట్లు  కథనం వెబ్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. 

భారత్‌ను దెబ్బతీయడం కోసమే చైనా ఈ జీవాయుధాన్ని తయారు చేసిందని... కానీ అది లీకై డ్రాగన్‌కే ముప్పుగా పరిణమించిందనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. చైనా ల్యాబ్‌ల్లో జీవాయుధం తయారు చేస్తుండొచ్చని ఇజ్రాయెల్‌ లెఫ్టినెంట్ కల్నల్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మెడికల్ మైక్రోబయాలజీ నుంచి డాక్టరేట్ పొందారు. 

బయో సైన్స్‌లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. చైనా కరోనా వైరస్ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.  చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. 

ఈ వైరస్ కారణంగా ఇప్పటికి చైనాలో 132 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 6,000 వేలమంది ఆసుపత్రులలో  చేరారు.  ఈ వైరస్ ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.  కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ లో తీవ్ర ప్రభావం చూపుతోంది. 

ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కి.మీ. దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఇక్కడ ఎబోలా, నిఫా లాంటి ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేపడతారు.ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది.

గ్రేట్ గేమ్ ఇండియా అనే ఆన్‌లైన్ పోర్టల్ ప్రకారం.. ఈ వైరస్ మూలాలు కెనడాలో ఉన్నాయి. చైనాకు చెందిన ఇద్దరు బయోలాజికల్ వార్‌ఫేర్ ప్రోగ్రాం ఏజెంట్లు ఈ వైరస్‌ను గుట్టు చప్పుడు కాకుండా చైనాకు తీసుకెళ్లారని సంచలన కధనం వెలువరించింది.