ఎంఐఎం చేతిలో కార్ స్టీరింగ్... ప్రజలే బ్రేక్ 

అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న కారుకు ప్రజలు బ్రేక్ లు వేయాలని  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ పిలుపిచ్చారు. కార్ స్టీరింగ్ కూడా ఎంఐఎం  చేతుల్లో ఉందని ఆయన ధ్వజమెత్తారు.  సీఎం కేసీఆర్ మాటల గారడి చేస్తున్నాడని, ఆయన మాయ మాటలు నమ్మి ఓటు వేసిన ప్రజలు మోసపోయారని విచారం వ్యక్తం చేశారు. 

టీఆర్‌ఎస్‌ పాలన పై ఛార్జ్  షీట్ ను విడుదల చేస్తున్నామని చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో లండన్, ఇస్తాంబుల్, డల్లాస్ లాగా అద్దం లాంటి  రోడ్లు వేస్త అన్నడు. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళలా తయారు జేస్తా అన్నడు. గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్త అన్నారు. మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు” "అంటూ ఎద్దేవా చేశారు. 

ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు పరచలేదని అంటూ పార్శీగుట్ట ను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఆడ ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు కేంద్ర నిధులు ఇచ్చింది తప్ప కేసీఆర్ ఇవ్వలేదు” అని విమర్శించారు. 

పేదల సంక్షేమం వదిలి, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతూ నియంతలా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. కారు ను అదుపు చేయకపోతే ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.  అందుకే టీఆర్‌ఎస్‌  కు కాకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేయాలని పిలుపిచ్చారు.