ప్రతిపక్షాల `మహా కూటమి ’ వారసత్వం కోసమే !

దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్న `మహాకుటమి’ తమ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసమే గాని, దేశాభివ్రుద్ది కోసం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశితంగా విమర్శించారు. “నేడున్న ఏకైక ప్రశ్న వారు ఎన్నికల లోపు విడిపోతారా, లేదా ఎన్నికల తర్వాత అన్నదే” అంటూ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవహేళన చేసారు.

తమ  ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతోందనే విషషయం విపక్ష పార్టీలకు బాగా అర్థమైందని, అందుకనే వారిపై వారికి నమ్మకం లేక అంతా కలిసి తమపై  పోరాటానికి సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేసారు.  వీరు కుటుంబ పాలన, అవినీతిలో ఒకరిని మరొకరు మించిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు ఓటేయరని తెలిసిఅనవసర అంశాలను వివాదం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని ద్వజమెత్తారు.

జిఎస్టి పట్ల ప్రజలను రెచ్చగొట్టడం కోసం గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ బాగా కృషి చేసారని అంటూ అయితే ప్రజలు ఆయనను తిరస్కరించాలేదా ? అంటూ ప్రశ్నించారు.

ఎన్డియే కూటమి పటిష్టంగా ఉన్నదని, మరింతగా బలం పున్జుకొంతున్నదని అంటూ ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలను ఉదాహరించారు. అవి లోక్ సభలో తన ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం. మరొకటి రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నిక. ఈ రెండు సందర్భాలలో కూడా తమ బలం చెక్కు చెదరక పోవడమే కాకుండా, అనూహ్య వర్గాల నుండి అదనపు మద్దతు పొందగాలిగామని గుర్తు చేసారు.

“మా భాగస్వాములు కాని వారు కుడా మాకు మద్దతు ఇచ్చారు. ప్రజలలో తన పలుకుబడిని ఈ మధ్య సంవత్సరాలలో బిజెపి గణనీయంగా పెంచుకొంటూ పోవడమే కాకుండా ఎన్డియే కుటుంభంలో కొత్తవారు వచ్చి చేరుతూనే ఉన్నారు” అని ప్రధాని తెలిపారు.

బిజెపి-పిడిపి పొత్తు చేదిరిపోవడం గురించి ప్రశ్నిస్తూ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మృతి అనంతరం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని అంగీకరించారు. అందుకనే ఎవ్వరిపై ఎటువంటి అపవాదులు వేయకుండా అధికారం నుండి బిజెపి వైదోలిగినదని చెప్పారు.

యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తమ ప్రభుత్వం విఫలమైన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ గత ఒక సంవత్సరం లోనే కోటి మందికి పైగా ఉద్యోగాలు కల్పించమని తెలిపారు. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ విషయమై తమ ప్రచారాన్ని మానుకున్నావని ఎద్దేవా చేసారు.

సుప్రీంతీర్పు ఆదేశాలతో రూపొందిన ఎన్నార్సీని వ్యతిరేకించడంలో అర్థం లేదని ప్రధాని హితవు చెప్పారు. తమపై తమకు, ఉన్నత రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేనివారంతా ఆత్మరక్షణలో పడి ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  2005లో పార్లమెంటులో తనేం చెప్పారో మమత గుర్తుతెచ్చుకోవాలని హితవు చెప్పారు. ఎన్నార్సీపై కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

దేశంలో కులప్రాతిపదిక రిజర్వేషన్ లను తొలగించే ప్రసక్తి లేదని అంటూ వాటి కొనసాగింపుపై ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు ఉండనవసరం లేదని స్పష్టం చేసారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకోన్మాద ఘటనలు, మహిళలపై నేరాలు బాధాకరమని చెబుతూ ఇటువంటి  ఘటనలపై  కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసారు.  మహిళలపై నేరాలు, మూకోన్మాద చర్యల విషయంలో కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు తమ  ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేసారు.