టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ భయం పట్టుకుంది 

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ భయం పట్టుకుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ కు ధీటుగా ప్రజల మద్దతు తమకుందని అందుకే గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో భయపడుతుందని ఎద్దేవా చేశారు. 

బిజెపి అభ్యర్థులను టార్గెట్ చేసి ఎన్నికలలో నిలపడొద్దని టీఆర్ఎస్ వాళ్లు వార్గింగ్ ఇవ్యవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై.. పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

ఖమ్మం, వరంగల్, నల్లగొండ, పరకాలలో బీజేపీ అభ్యర్థులను టార్గెట్ చేసి కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవక పోతే బీజేపీ నాయకుల అంతుచూస్తామని బెదిరిస్తున్నట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 

ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను బలవంతంగా ఏకగ్రీవం చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఏంఐఏం, టీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలుగా వ్యవహారిస్తూ… రాజీ పడని వారిపై దాడి చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి దుయ్యబట్టారు.  ఎంఐఎం గుండాలు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టింస్తున్నారని చెప్పారు. అధికార పార్టీకి పోలీసులు  వంతపాడుతున్నారని మండిపడ్డాయిరు. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.