ఓడరేవు వద్ద పోర్ట్ నిర్మాణానికి గడ్కరీ సుముఖత

ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ వ్రాసారు. ఈ ఓడరేవు నిర్మాణం కోసం  ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని గడ్కరీ  సూచన చేశారు. ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే బాగుంటుందని సూచించారు.

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ తరుణంలో ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి.