భైంసాలో  అర్ధ రాత్రి బీభత్సం.. 18 ఇళ్ళు దగ్ధం

 ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనారిటీ  వర్గానికి చెందిన వ్యక్తులు అర్ధరాత్రి జరిగిపిన  దాడిలో దాదాపు 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.

జనవరి 12న పట్టణంలోని ఒక ప్రాంతంలో ఆ వర్గానికి చెందిన ఓ  యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా  హంగామా చేస్తుండటంతో  స్థానిక యువకులు మందలించారు. ఇదే అదనుగా, ఘర్షణలే లక్ష్యంగా దాదాపు 400-500 మంది హిందువుల ఇళ్లపై ప్రణాళిక  బద్దంగా దాడి చేసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.

హిందూ జనాభా తక్కువగా ఉన్న కొర్బా వీధిలో 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.  వీటిలో స్థానిక హిందు వాహిని కార్యకర్త ఇంటిని అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడంతో పాటు స్థానిక ఇండ్లను సైతం లూటీ చేశారు

అక్కడే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో.. రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహ్మారావు, సీఐ వేణుగోపాల రావు, ముథోల్ ఎస్‌ఐ అశోక్‌లతో పాటు మొత్తం ఎనిమిది మంది పోలీసులు  కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.

 ప్రస్తుతం భైంసా పట్టణంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు పర్యటించారు. ఘర్షణ తలెత్తడానికి గల కారణాలను.. స్థానికలను అడిగి తెలుసుకున్నారు.

దాడిలో పాల్గొన్నవారు స్థానికులతో పాటు, సమీపంలోని నిర్మల్ పట్టణానికి చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒక ప్రవేట్ కార్యక్రమానికి వచ్చిన వారుగా స్థానికులు తెలిపారు.