మైనార్టీలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు

మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని తరుచూ చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  వారికి మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదో వివరణ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి వారానికో లేఖ సంధిస్తున్న కన్నా ఈరోజు 13వ లేఖను రాశారు. గతంలో ఎన్నడూ మైనార్టీలు లేని మంత్రివర్గాన్ని రాష్ట్రంలో చూడలేదని కన్నా తెలిపారు.

గత నాలుగేళ్ళల్లో వారికి మంత్రివర్గంలో స్థానం లభించక పోవడం మీ అసమర్థ మోసపూరిత విధానాలకు నిదర్శనమా లేదా వారెవ్వరిపై మీకు నమ్మకం లేదా అని నిలదీసారు.

 రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిధులను, ప్రత్యేక హోదాపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి ఎలా వెచ్చిస్తారని నిలదీశారు. విద్యార్ధుల నుండి, నిరుద్యోగుల నుండి వివిధ పరీక్షల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్న ఈ నిధులను విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, పరిశోధనలకు వినియోగించాలి గదా అని ప్రశ్నించారు. ఏదో ఒక వంకతో పార్టీ  ప్రచారానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిధులు కోట్లాది రుపాయిలను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ద్వజమెత్తారు.

రాష్ట్రంలో టిడిపి నేతలు మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకుని,  ఆ నిధులను కాజేస్తున్నారని కన్నా ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు, వాటి వినియోగంపై సిబిఐ విచారణకు సిద్దమా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

దారుణంగా 29 మంది అమాయక భక్తులను బలితీసుకున్న గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేదిక నిజమని  చంద్రబాబు నమ్మతున్నారా? అని ప్రశ్నించారు. ఘటన జరిగి 72 గంటల పాటు ఉంచవలసిన విపత్తు యాజమాన్య సంస్థ వద్ద ఉంచకుండా అక్కడి సీసీ కెమెరాల దృశ్యాలు ఎందుకు డిలీట్‌ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చంద్రబాబుకు సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా? అని సవాల్‌ చేశారు.

హైదరాబాద్‌, ఉండవల్లి, నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసాలకు మరమ్మతుల పేరిట రూ.3.20కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేయడం ఎంతవరకు సమంజసమని కన్నా ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న ముఖ్యమంత్రి ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని కన్నా డిమాండ్‌ చేశారు.