తీసుకొచ్చిన రూ 1.30 లక్షల కోట్ల అప్పులేమి చేసారు చంద్రబాబు !

వివిధ పథకాల పేర్లు చెప్పి రాష్ట్రానికి ఆర్‌బీఐ నుండి రూ 1.30 లక్షల కోట్ల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణం తెచ్చారని చెబుతూ వాటిని ఏమిచేశారో తక్షణమే ప్రజలకు తెలపాలని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  డిమాండ్ చేసారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల పదాధికారుల సమావేశంలో  మాట్లాడుతూ రాస్త్రంలో టిడిపి పాలనా అవినీతిలో కూరుకు పోయినదని దయ్యబట్టారు. ఈ ప్రభుత్వం  అన్ని రంగాల్లో రాష్ట్రప్రభుత్వం విఫలం చెందిందని ద్వజమెత్తారు.

ఏ జిల్లాలో చూసినా నిరుద్యోగ యువతకు అవుట్‌సోర్సింగ్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటూ, వచ్చిన డబ్బును మంత్రి లోకేష్ ఖాతాకు చేర్చాలంటున్నారని ఉద్యోగులే చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎఫ్‌ఎంఎస్ పేరుతో ఆన్‌లైన్ ఉద్యోగులకు వేతనాలిస్తున్నామంటూ రూ 230 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరు ఐదుసార్లు జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇందులో జరిగిన మోసంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీలకు స్కాలర్‌షిప్పులు ఇస్తామని ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి సమాచారం లేకుండా మోసం చేసి రూ 70 కోట్లు నిరుపయోగం చేశారని ద్వజమెత్తారు. జాతీయ రహదారులకు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలను నియమించనున్నట్లు కన్నా తెలిపారు. ప్రతి ఐదు బూత్ కమిటీలకు శక్తి కేంద్రం బాధ్యులను నియమిస్తామని పేర్కొన్నారు.

రూ 1.30 కోట్లు అప్పు తీసుకుని గాలేరు, హంద్రీ-నీవా ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదని దయ్యబట్టారు. నిరుద్యోగులను భృతి పేరుతో మోసం చేసి మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాలనే యోచనలో ఉన్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో వ్యాట్ పెంచడమేనని విమర్శించారు. వాటిపై సెస్ అదనంగా నాలుగు రూపాయలు వేశారని గుర్తు చేసారు. అమరావతి నిర్మాణం కోసం ఇటుకలను అమ్మారని, ఎన్‌ఆర్‌ఐ నుంచి తీసుకున్న ధనం ఏమైందని ఆయన నిలదీశారు.

 రాజధాని కోసం రూ 3500 కోట్లు నిధులు కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటివరకు అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టును నిర్మించలేదని తెలిపారు. ఐటీ సంస్థల ఆహ్వానం పేరుతో ప్రజల ధనాన్ని మంచినీళ్లలా చంద్రబాబు, లోకేష్ ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అవినీతికి వ్యతిరేకంగా అక్టోబర్ 6 నుండి రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.