సౌరభ్‌ గంగూలీకి బీసీసీఐ సారధ్య అవకాశం !

 

కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు కొత్త రూపు తెచ్చిన సౌరభ్‌ గంగూలీకి  వరుసగా పలు నిర్వహణ పరమైన సంక్షోభాలతో తన ప్రతిష్టను మంగకలుపుకున్న బీసీసీఐకి సారధ్యం సహించే అవకాశం వారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు సుప్రీం కోర్ట్ ఆమోదించిన బీసీసీఐ ముసాయిదా రాజ్యాంగాన్ని అమలులోకి తెస్తే అందరికన్నా అర్హతగల అభ్యర్థిగా ఈ పదవికి గంగూలీ నిలబడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

 

గంగూలీ వంటి వారు సారధ్యం వహిస్తే బీసీసీఐ ప్రతిష్టను ఇనుమడింపచేసే అవకాశం కలుగుతుందని కూడా ఈ సందర్భంగా క్రీడా వర్గాలు  పేర్కొంటున్నాయి. లోధా కమిటీ రూపొందించిన నిబంధనను పరిగణలోకి తీసుకొంటే ప్రస్తుతం బీసీసీఐలో ఉన్న కార్యనిర్వాహకులు మాత్రమే కాకుండా, ఐపీఎల్ లోని సారధులు సహితం ఈ పదవికి అర్హత పొందలేరు.

 

తక్షణం రాష్త్ర  సంఘాలను,బీసీసీఐని నూతన రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకొని, ఆ మేరకు ఎన్నికలు జరిపమని సుప్రీం కోర్ట్ ఆదేశించడం తెలిసిందే. పదవీ కాలంపై నిబంధన కారణంగా ప్రస్తుత, గత పాలకుల్లో ఎక్కువ మంది పోటీ పడేందుకు కుదరదు. గతంలో ఒక పర్యాయం తర్వాత మూడేళ్ల విరామం ఉండాలని ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సవరించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండే అవకాశం సభ్యులకు లభించింది.

 

ఐతే రాష్ట్ర సంఘం, బీసీసీఐ పదవులను కలిపి పదవీ కాలం వరుసగా ఆరేళ్లకు మించకూడదు. దాని ప్రకారం ప్రస్తుతం బోర్డులోని సీనియర్లు పదవులకు దూరం కావాల్సిందే. అందుకే వారు గంగూలీపై దృష్టిసారించారు. బోర్డు రాజకీయాలు గంగూలీకి కొత్త కాదు. నాలుగేళ్లుగా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం పాలనాధికారిగా ఉంటున్నాడు. క్యాబ్‌ అధ్యక్షుడిగా మంచి పేరు కూడా సంపాదించాడు.

బోర్డు రాజకీయాల్లోనూ గంగూలీ కీలకంగా మారాడు. ఒకవేళ గంగూలీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనా గరిష్ఠంగా రెండేళ్లు మాత్రమే అతడు ఆ పదవిలో ఉండగలడు. ఎందుకంటే వరుసగా నాలుగేళ్లుగా అతడు క్యాబ్‌ పదవిని అనుభవిస్తున్నాడు. గూంగూలీ  రెండేళ్లున్నా చాలు బోర్డు మళ్లీ శక్తిమంతంగా మారుతుందన్నదని బోర్డు సభ్యులు విశ్వాసం వ్యక్తం చేటున్నారు.