జార్ఖండ్‌లో ఆధిక్యతలో కాంగ్రెస్ కూటమి 

జార్ఖండ్‌లో ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి సంకేతాలు కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉన్నట్లు తెలుపుతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తున్న, పూర్తి ఆధిక్యతను దూరంలో ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ జేఎమ్ఎమ్ కూటమి 40 స్థానాల్లో ముందడుగులో ఉంది. ఏజెఎస్‌యూ 6 స్థానాల్లో, జేవిఎమ్ పార్టీ 3 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో  ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.  మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికారిన్ని చేపట్టాడినిక కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. 

జమ్షెడ్‌పూర్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున రంగంలోకి దిగిన రఘుబర్ దాస్ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు స్థానాల్లో పోటీకి దిగిన జేఎమ్ఎమ్ కీలక నేత హేమంత సోరేన్ ఒక స్థానంలో వెనుకబడి ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ కీలక నేత గౌరవ్ వల్లభ్ వెనుకబడినట్టు తెసుస్తోంది. మరోవైపు జేవీఎమ్ కీలక నేత బాబూ లాల్ మరాండీ ప్రస్తుతం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.

జార్ఖండ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. 81 అసెంబ్లీ స్థానాలలో జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  

 ఈ ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) లతో కలిసి కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసింది. కాగా.. జార్ఖండ్ చరిత్రలో ఏ సీఎం కూడా రెండోసారి గెలిచి సీఎం కాలేదు. జార్ఖండ్ ఓటర్లు ఒక సీఎంకు మరోసారి ఆ పదవిని కట్టబెట్టలేదు. జార్ఖండ్ మాజీ సీఎంలు ఎవరూ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు.