అమెరికాలో ఎన్నికల ప్రచారానికీ చంద్రబాబు శ్రీకారం!

ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించడం కోసం అంటూ అమెరికకు అధికార పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికలకు ముందుగా విదేశి గడ్డపై నుండే ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లోగా తాను మళ్లీ రావడం సాధ్యపడదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో టిడిపి  ఓటు వేయాల్సిందిగా అందర్నీ ఇప్పుడే కోరుతున్నట్లు చెప్పారు. ప్రవాసాంధ్రుల్లో ప్రతి ఒక్కరి ఓటు టిడిపికే పడుతుందని ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేసారు.

ప్రవాస భారతీయులకు కుడా ఓటు హక్కు కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించడం, ఆ మేరకు ఇప్పటికే లోక్ సభ బిల్లును ఆమోదించడం జరగడంతో త్వరలో రాజ్యసభలో కుడా ఆమోదం పొంది, వచ్చే ఎన్నికల నాటికి ప్రవాసాంధ్రులు అందరికి వోట్ హక్కు లభిస్తుందని భావిస్తున్నారు. అందుకనే తమ అమెరికా పర్యటనను చంద్రబాబునాయుడు పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకొంటున్నారు. మొదటి సారిగా అమెరికాలో కుడా పార్టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

 ‘‘ప్రవాసాంధ్రులకు ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్‌, ఆత్మవిశ్వాసమంటే చంద్రబాబు మాత్రమే గుర్తుకొస్తారు. అమెరికాలో ఇలా టిడిపి జెండా ఎగురుతుందని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌ కూడా అనుకుని ఉండరు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో టిడిపి జెండా రెపరెపలాడుతుందని ఏనాడూ అనుకోలేదు’’ అని పేర్కొన్నారు. టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం అవసరమని భావించే వారంతా దాని కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరారు.

అమెరికాలో అడుగు పెట్టినప్పటి నుంచి తనకు ప్రవాసాంధ్రుల నుంచి ‘మళ్లీ నువ్వే రావాలి’, ‘నీ వల్లే మేం ఇక్కడున్నాం. మా వంతు సహకారం అందిస్తాం’ అన్న నినాదాలు మిన్నంటుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.  ప్రవాసాంధ్రులకు ఈ ఏడాదే ఓటు హక్కు లభించనుందని, వారంతా వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేయడంతో పాటు, పార్టీ తరఫున ప్రచారమూ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ప్రచారం చేసారు.

తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. న్యూజెర్సీ ఎన్‌ఆర్‌ఐ టిడిపి ఆధ్వర్యంలో ‘న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్‌ సెనేట్‌’లో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. న్యూజెర్సీతో పాటు, అమెరికాలోని ఇతర ప్రాంతాల నుంచి సుమారు 4వేల మందికి పైగా టిడిపి అభిమానులు కుటుంబాలతో పాల్గొన్నారు.

 ‘‘మీలో చాలా మంది మీరు ఎంచుకున్న రంగాల్లో లక్ష్యాన్ని సాధించారు. ప్రజాసేవ చేయాలనుకునేవారికి అవకాశం కల్పిస్తాం. అలాంటి వారికి టిడిపి వేదికగా నిలుస్తుంది’’ అంటూ వారు కోరిన వారికి సీట్లు కుడా ఇస్తామనే భరోసా ఇచ్చారు. అక్టోబరులోగా ప్రవాసాంధ్రులు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వారి సౌలభ్యం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ టిడిపి సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకతిన్కాహ్రు.

చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని చేపప్రు.  ‘‘అమెరికాలోని ప్రధాన నగరాల్లో పార్టీ కమిటీలను వేస్తాం. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కల్పిస్తాం. టిడిపిపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు అవసరమైతే మీ అందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, మరింతగా సేవలందించడం సాధ్యమవుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.