రామచంద్ర గుహ  అర్బన్‌ నక్సలైట్‌

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను  అర్బన్‌ నక్సలైట్‌గా పేర్కొంటూ కర్ణాటక బిజెపి సంచలన వాఖ్య చేసింది. ఆయన చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ శాఖ శనివారం తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘

‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబు: నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్స్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరఫున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శించుకుంటారు" అంటూ తెలిపింది. 

 పైగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారని అంటూ వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆయన మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేసిది. 

ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను నిర్బంధించడం తీవ్ర అప్రజాస్వామికమనీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.