విభజన సమస్యల పరిష్కారంకే పౌరసత్వ చట్టం

దేశ విభజనతో జరిగిన ప్రమాదాలను పరిష్కరించి, దేశంలేని పరిస్థితులలో ఉన్నవారికి ఒక అవకాశం కల్పిస్తామని పార్టీ చేసిన హామీలను పౌరసత్వ సవరణ చట్టం, 2019తో అమలు చేసిన్నట్లు అయినదని ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్ ఛార్జ్ అయిన బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలో భాగాలు:

ఈశాన్య రాష్ట్రాలలో, ముఖ్యంగా అస్సాంలో అశాంతి ముందుగా ఉహించలేదా?

ఈ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించడం మా ప్రభుత్వం, పార్టీ పూర్తి చేసిన చారిత్రాత్మకమైన హామీ. మనదేశంలో చాలా సంవత్సరాలుగా దాదాపు దేశం లేని పరిష్టితులలో  నివసిస్తూ భారత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీనికి తప్పుడు భావనతతో చూపుతూ కొన్ని పార్టీలు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. 

ఈ చట్టం మొత్తం  దేశానికి వర్తిస్తుంది. ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఈశాన్య ప్రాంతంలో మొత్తం మీద పరిస్థితి  సాధారణంగా, శాంతియుతంగా ఉంది. త్రిపురలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మేము చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించాము. గిరిజన బృందాలు తమ సమస్యలను ముఖ్యమంత్రి బిపీలాబ్ కుమార్ దేబ్ ను కలసి చర్చించి తమ ఆందోళనను ఉపసంహరించు కొంటున్నట్లు ప్రకటించాయి. 

కొన్ని నిరసనలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం అస్సాం. ఈ చట్టం ఏ రాష్ట్ర  ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా - ఇద్దరూ  చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, భాషలను కాపాడే బాధ్యతలను భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం తీసుకొంటుందని మరోసారి హామీ ఇస్తున్నాము. అస్సాం ఒప్పందాన్ని, ముఖ్యంగా అస్సాం గుర్తింపు కాపాడటం కోసం రాజ్యాంగ, చట్టపర, ఇతర యంత్రాంగములను కల్పిస్తామని హామీ ఇస్తున్న సెక్షన్ 6 అమలుకు మేము కృత నిశ్చయమతో ఉన్నాము.  

చట్టంలో ముస్లింలను మినహాయించారు 

వారికి పౌరసత్వం కోరే ఒక అవకాశం కల్పించడం కల్పిస్తూ మైనారిటీల సాధికారికతకు ఈ చట్టం ఉద్దేశించినది. మత ప్రాతిపదికగా జరిగిన విభజన సమయంలో రెండు వైపులా పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. మొదటి మూడేళ్ల కాలంలో పౌరసత్వ అంశంపై దృష్టి సారించినా ఆ తర్వాతి సంవత్సరాలలో పాకిస్థాన్, బాంగ్లాదేశ్ లు ఇస్లామిక్ రాజ్యాలైన తర్వాత ఆ రెండు దేశాల నుండి మరేనేకమంది వచ్చారు. గత పలు సంవత్సరాలుగా మరి అనేక వలసలు కొనసాగుతున్నాయి. 

అయితే నేడు కనీసం బాంగ్లాదేశ్ నుండి అటువంటి వలసలు తగ్గాయి. కానీ పాకిస్థాన్ నుండి కొనసాగుతున్నాయి. వేధింపులకు భయపడి ఇప్పటికే భారీ సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల వారు సరిహద్దు ప్రాంతాలకు వస్తున్నారు. ఈ దేశం మత ప్రాతిపదికన విభజనకు గురైన తర్వాత జరుగుతున్న మతపర వేధింపులకు ఇది స్పష్టమైన ఉదాహరణ. దేశ విభజన జరగగానే వారిని మనం ఆమోదించాము.

బాంగ్లాదేశ్ యుద్ధం తర్వాత మనం వారిని ఆమోదించాము. తర్వాత, ఇందిరా-ముజీబ్ ఒప్పందం ప్రకారం భారత దేశంకు వలస వచ్చి ఇక్కడ పౌరసత్వం తిరస్కరించిన 15 లక్షల మందిని అంగీకరించాము. దానితో వారిక్కడ మన పౌరులుగా, పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారు. ఇటువంటి వారికి మన పౌరసత్వం కోరే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. దీనిని మనం ఎవ్వరిపై రుద్దడం లేదు లేదా ఎవ్వరిని కాదనడం లేదు. 

బలోచీలు, హాజరాలు, అహ్మదీయులను చేర్చలేదే?

చరిత్రపరంగా, ఎవ్వరు కోరినా వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, టిబెటియన్లు, శ్రీలంక తమిళులు ఇక్కడకు వచ్చారు. వారంతా మన పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం పొందారు. ఈ చట్టం ప్రకారం ఇక్కడ 12 సంవత్సరాల పాటు నివాసం ఉంటె పౌరసత్వం కోరవచ్చు. దీనిని సహజన్యాయంగా పేర్కొంటున్నారు. ఏ వర్గానికి కూడా దీనిని నిరాకరించడం లేదు. ప్రస్తుత ప్రత్యేక చట్టం దేశ విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించినది. వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. 

వారి సంఖ్య ఏమేరకు ఉంది? 

ఖచ్చితంగా వారి సంఖ్య తెలియదు. 1970వ దశకంలో ఇందిరా-ముజీబ్ ఒప్పందం జరిగినప్పుడు ఆ సంఖ్య 15 లక్షల వరకు ఉంది. 

పశ్చిమ బెంగాల్ లో  హిందూ ఓట్ బ్యాంకు సృష్టించుకోవడమే వ్యూహమా?

ఈ నిర్ణయాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం తగదు. ఒకటిన్నర సంవత్సరంకు పైగా ఎన్నికలకు వ్యవధి ఉంది. అదే మా ఉద్దేశ్యమైతే వచ్చే సంవత్సరం, ఎన్నికలకు ముందుగా ఈ చట్టాన్ని తీసుకు రాకుండా మమ్ములను ఎవ్వరు అడ్డుకుంటారు?  మొత్తం లక్ష్యం లోక్ సభ ఎన్నికల ముందు మేము ప్రజలకు ఇచ్చిన మా హామీని నెరవేర్చుకోవడమే. 

 ప్రభుత్వం సత్వర దౌత్యపర చర్యలు చేబడుతుందా? 

ప్రతికూల దౌత్యపరమైన ప్రభావం లేకుండా చూడడం కోసం ప్రతి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను చెప్పిన్నట్లు దేశ విభజన సందర్భంగా ఏర్పడిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించే నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ చట్టం తీసుకు వచ్చాము. 

ఉదాహరణకు, 1950లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అస్సాం నుంచి నుండి అక్రమ వలసదారులు బహిష్కరించే చట్టం తీసుకు వచ్చింది. సరిహద్దు నుండి వేధింపులకు గురై వలసలు వస్తున్న అంశాన్ని పండిట్ నెహ్రు దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, అప్పట్లో కూడా, బహిష్కరణ నుండి అటువంటి ప్రజలను మినహాయించాలని నిర్ణయించడం జరిగింది. 

నేను ఇప్పటికే ఇందిరా-ముజీబ్ ఒప్పందం గురించి ప్రస్తావించాను. మేమిప్పుడూ చేస్తున్నది అల్లా ఆ విధంగా వలస వచ్చి, భారత దేశంలో నివాసం ఉంటున్న వారికి పౌరసత్వం కోరే అవకాశం కల్పించడం. మరే దేశంపై వ్యతిరేకంగా మేము ఎటువంటి బలవంతపు వైఖరిని ఆవలంభించడం లేదు. 

కాబట్టి, ఈ చట్టం కారణంగా ఏ దేశపు ప్రయోజనాలు ఏ విధంగా కూడా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. ఇది భవిష్యత్ కు వర్తించే చట్టం కాదు. పౌరసత్వాన్ని పరిశీలించడానికి డిసెంబర్ 31, 2014ను గడువు తేదీగా నిర్ణయించడం జరిగింది. 

జాతీయ పౌరుల రిజిస్టర్ తో కొన్ని వర్గాలను దూరంచేసి యత్నం?

అటువంటి ఆందోళనలు నిరాధారం. ప్రపంచంలో ఏ దేశం కూడా పౌరులు కాని వారికి పౌరులకు ఉండే హక్కులను అనుమతించదు. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి వారి వారి పద్ధతులు ఉంటాయి. భారత దేశంలో ఇంతకు ముందు అటువంటి అభ్యాసం 1951లో జరిగింది. 

మనదేశంలో 1.25 కోట్లమంది అక్రమంగా నివాసం  ఏర్పరచుకున్నారని, వారిని గుర్తించడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదని గుజ్రాల్ మంత్రివర్గంలో హోమ్ మంత్రిగా ఉన్న సిపిఐ నేత ఇంద్రజిత్ గుప్తా తెలిపారు. కాబట్టి, 1951లో చేసిన అభ్యాసాన్ని ఇప్పుడు తిరిగి సాగిస్తాము.