ఏపీకి మూడు రాజధానులు... జగన్ ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్ పై ఒకవంక సందిగ్థత పరిష్టితిని సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిమరోవంక ఒకటి కాదు, మూడు రాజధానులు ఉండబోతున్నట్లు స్వయంగా అసెంబ్లీలో స్వయంగా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని శాసనసభలో ప్రకటించారు. 

రాజధాని అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని పేర్కొన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసిన జగన్.. ఏపీకి బహుశా మూడు రాజధానులు రావచ్చునని సూచించారు. 

రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సభకు తెలిపారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ వెల్లడించారు. 

రకరకాల ఆలోచనలు ఉన్నాయనిచెబుతూ అమరావతిని అభివృద్ధి చేసే ఆసక్తి లేదని పరోక్షంగా ప్రకటించారు. క్యాపిటల్ డెమన దగ్గర డబ్బులు లేవని..చంద్రబాబు సేకరించిన అమరావతిలో రాజధానిని అభివృద్ధి  చేయాలంటే లక్షల కోట్ల రూపాయప్రశ్నించారు. 

.అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉందని నిలదీశారు.  ఇఫ్పటికే సేకరించిన అప్పులకే కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ తరుణంలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందని చెబుతూ రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు.  కాగా, వైజాగ్ లో ఓ మెట్రో రైలు వేస్తే సరిపోతుందని, మిగతా అన్ని సౌకర్యాలు  వైజాగ్ లో ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. 

మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాక అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన అని నిప్పులు చెరిగారు.  

‘మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు? సీఎం ఇక్కడ కూర్చుంటారా? లేక విశాఖ, కర్నూలులో ఉంటారా? ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ప్రజలు మూడు రాజధానుల్లో తిరిగి పనులు చేసుకుంటారా? ప్రజలు అమరావతిలో ఒక ఇల్లు, కర్నూలులో మరో ఇల్లు కట్టుకుంటారా? విశాఖలో సెక్రటేరియట్ కట్టి ఏం చేస్తారు? 'అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.