పార్టీ కార్యక్రమంగా మెట్రో రైలు ప్రారంభోత్సవం

హైదరాబాద్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్రో రైలు’ అమీర్ పేట-ఎల్బీనగర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దృష్ట్యా ఆపార్టీ కార్యక్రమంగా మార్చిన్నట్లు కనిపిస్తున్నది. దీనికి సంబంధించి ప్రధాన పత్రికల్లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలలో ఆపద్ధర్మ ప్రభుత్వం నేతలకు మాత్రమె చోటు కల్పించారు. నగరానికి చెందిన బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఫోటో, పేరు ఎక్కడ కనిపించనే లేదు.

ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ లతోపాటు నగర మంత్రులు, మేయర్ ఫోటోలకు మాత్రమె ఆ ప్రకటనలో చోటు కల్పించారు. మరోవంక నగరంకు చెందిన బిజెపి ఎమ్యేల్సి యన్ రామచంద్రరావుకు సహితం చోటు కల్పించలేదు.  రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు అయినా శాసన మండలి రద్దు కాలేదు. అట్లాగే పార్లమెంట్ కొనసాగుతున్నది. అయినా సరే దత్తాత్రేయను విస్మరించటంపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మరోవంక, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం వయబులిటి గ్యాఫ్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద సాయం కూడా అందిస్తుంది. గతేడాది మెట్రో రైలును స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దానితో తప్పనిసరిగ్గా కేంద్ర మంత్రిని కుడా ఆహ్వానించ వలసి ఉన్నా అటువంటి ప్రయత్నం చేసిన్నట్లే కనిపించడం లేదు. కనీసం కేంద్ర మంత్రి ఫోటోను కుడా ప్రకటనలలో ముద్రించలేదు.

పైగా ప్రస్తుతం మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమం దత్తాత్రేయ నియోజకవర్గ పరిధిలోనే జరుగుతున్నది. అటువంటిది దత్తాత్రేయను ప్రభుత్వ ప్రకటనలలో విస్మరించడం రాజకీయ కారణాలతోనే జరిగిన్నట్లు భావించవలసి వస్తున్నది.

పైగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించ వలసిన గవర్నర్ నరసింహన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్తోంటు ఈ అంశాన్ని పట్టించుకొనక పోవడం సహితం వివాదంగా మారుతున్నది. ఈ విషయంలో పొరపాటుకు బాధ్యులైన  అధికారులపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.