కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు  

కర్ణాటక ప్రజా తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా హజారీబాగ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని కొనియాడారు. 

కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమికి ఎదురైన పరాభవాన్ని ప్రస్తావిస్తూ  కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత, నేడు, ప్రజా తీర్పును అవమానించినవారికి ప్రజాస్వామిక పద్ధతిలో ఓటర్ల నుంచి సమాధానం దొరికిందని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలా? వద్దా? అనే పరిస్థితి ఉందని, కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించారని చెప్పారు.

ఇది భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓ సందేశమని చెప్పారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా, ప్రజలను అవమానిస్తున్నట్లేనని, అలాంటివారికి ప్రజలు అంతిమంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.