జార్ఖండ్‌లో బిజెపికి సంపూర్ణ ఆధిక్యత 

జార్ఖండ్ ప్రజలు సుపరిపాలన, రాజకీయ సుస్థిరతకు అనుకూలంగా ఓటు వేస్తారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి రాజీవ్ ప్రతాప్ రూడీ విశ్వాసం వ్యక్తం చేశారు. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి పరిపూర్ణ ఆధిక్యత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో రాజకీయ అస్థిరత ఉండేదని గుర్తు చేశారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు జార్ఖండ్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక విజన్ తమ పార్టీకి ఉందని చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సులువవుతుందని చెప్పారు.

రాష్ట్రంలోని రఘుబర్ దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్ళలో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, గిరిజన సంక్షేమం కోసం కృషి చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్ అభివృద్ధి పట్ల నిశితంగా దృష్టి సారించారన్నారు.

జార్ఖండ్ శాసన సభ ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతున్నాయి. నవంబరు 30న జరిగిన తొలి దశలో 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 20న తుది దశ పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగుతుంది.