పాకిస్తాన్ తో రాహుల్ `అంతర్జాతీయ మహాకుటమి’

రాఫేల్ డీల్ విషయమై ఫ్రెంచ్ మాజీ అద్యక్షుడు ఫ్రాన్కిస్ హాలండ్ వెల్లడించిన అంశాలను ఆధారం చేసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకు పడుతూ ఉండటం పట్ల బిజెపి అద్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాకిస్తాన్ తో కలసి కాంగ్రెస్ అద్యక్షుడు “అంతర్జాతీయ మహాకుటమి” ఏర్పాటు చేసారా అంటూ ఎద్దేవా చేసారు. ఒకవైపు కాంగ్రెస్, మరో వైపు పాకిస్తాన్ కుడా మోడీ ని గద్దె నుంచి దింపాలని చూస్తున్నాయి గదా అని పేర్కొన్నారు.

“భారీ అవినీతి కుంభకోణం” నుండి తమ దేశ ప్రజల దృష్టి మళ్ళించడం కోసం భారత్ రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేసినదని ఆరోపిస్తూ ట్వీట్ ఇచ్చిన పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ హుస్సేన్ రాఫేల్ డీల్ పై రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై చేసిన విమర్శలను ఉపయోగించడంతో మోడీ ఈ తీవ్రమైన వాఖ్యలు చేసారు.

“మోడీ దిగి పోవాలి” అని రాహుల్ గాంధీ అంటున్నారు. “మోడీ దిగి పోవాలి” అని పాకిస్తాన్ కుడా అంటున్నది. ఇప్పుడు ప్రధాని మోడిపై రాహుల్ గాంధీ చేస్తున్న నిరాధార ఆరోపణలను పాకిస్తాన్ సహితం సమర్ధిస్తున్నది. అంటే ప్రధాని మోడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ `అంతర్జాతీయ మహాకుటమి’ని ఏర్పాటు చేస్తున్నదా ? అని ప్రశ్నిస్తూ అమిత్ షా ట్వీట్ చేసారు.

ఐక్యరాజ్యసమితి సర్వసాధారణ సమావేశాల సందర్భంగా రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హుస్సేన్ ప్రధాని మోడీ రాజీనామా చేయాలనీ కూడా కోరారు. “భారత దేశంలోని పలక వర్గం సాగిస్తున్న యుద్దొన్మాదాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఫ్రెంచ్ జెట్ రాఫెల్ డీల్ తర్వాత ఏర్పడిన పరిస్థితులలో ప్రధాని మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్ల నుండి భారత ప్రజల ద్రుష్టి మళ్ళించడమే భారత ప్రభుత్వ వ్యుహమని మాకు తెలుసు” అంటూ పాకిస్తాన్ మంత్రి పేర్కొన్నారు.