మతమార్పిడులపై స్పందించాలి

మతమార్పిడులపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడతానని స్పష్టం చేశారు. సామూహిక మత మార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్ కు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. 

తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మత మార్పిడిలకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కోరారు.

హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగేలా ప్రవర్తించినా తాను మాట్లాడతానని ప్రకటించారు. కడప దర్గాకు పోయి ఏ హిందువూ జై భవానీ అనడని…మెదక్ చర్చి దగ్గరకు వెళ్లి జై శ్రీరామ్ అనరని తెలిపారు. హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్లి జై జీసస్ అనకూడదు. అది ధర్మ విరుద్ధం అని స్పష్టం చేశారు. 

హిందూ దేవాలయాల వద్ద పర మత ప్రచారం చేస్తుంతే తాను కచ్చితంగా ఖండిస్థానని స్పష్టం చేశారు. అన్యమత ప్రచారం వద్దని హితవు చెప్పారు. ధర్మాన్ని కాపాడే హిందూ సంస్థల గురించి తాను మాట్లాడటం లేదన్న పవన్..మత మార్పిడులపై వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలని కోరారు.