2011 ముంబై ఉగ్రదాడి  కాంగ్రెస్-ఐ ఎస్ ఐ  కుట్ర!

సరిగ్గా 11 ఏళ్ళ క్రితం 163 మంది మృతకి, మరో 300 మంది గాయపడడానికి దారితీసిన ముంబై ఉగ్రదాడి- ఐ ఎస్ ఐ  ల కుట్రాఫలితంగా జరిగినదే అని ఆ సమయంలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలోభద్రతా వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ ప్రభుత్వ అధికారి ఆర్ వి ఎస్ మణి ఆరోపించారు.   తత్వాటాల్క్స్, నిజంల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సభలో "`హిందూ ఉగ్రవాదం'-కుట్ర" అంశంపై ప్రసంగిస్తూ దాడి జరిగిన వెంటనే ఎస్పీజీ దళాలను ఢిల్లీ నుండి ఆలస్యంగా ఉద్దేశ్యపూర్వకంగా పంపారని స్పష్టం చేశారు. 

"హిందూ ఉగ్రవాద అపోహ - హోమ్ మంత్రిత్వ  శాఖలోని అంతరంగికుని కధనం" గ్రంథ రచయిత అయిన మణి దాడి జరిగిన రాత్రి 10 గంటలకు ఎస్పీజీ ని ముంబైకి పంపాలని నిర్ణయించామని, 12 గంటలకల్లా వారు ఢిల్లీ విమానాశ్రయంపై చేరుకున్నరని, కానీ హోమ్ మంతిర్ శివరాజ్ పాటిల్ కూడా వారితో వస్తారని చెప్పడంతో వారు రెండు గంటలకు పైగా అక్కడనే వేచి ఉండవలసి వచ్చినదని చెప్పారు. ఎక్కడైనా యుద్దానికి వెడుతుంటే మంత్రులు వెంట వస్తారా అని విస్మయం వ్యక్తం చేశారు. 

ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా మంత్రికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పవలసిన వారు రాలేదని అరగంటకు పైగా విమానం లోనుంచి వారిని బైటకు రానీయలేదని పేర్కొన్నారు. ఎస్పీజీ దళాలు వచ్చేవరకు ముంబైలో అందుబాటులు ఉన్న పలు కేంద్ర దళాలను రంగంలోకి దింపాలని, వారు పరిస్థితి విషమించకుండా కట్టడి చేస్తారని తాను సూచించి అందుకు రాజకీయ నాయకత్వం ఒప్పుకోలేదని తెలిపారు. 

సాధారణంగా వాహనాలు వెంటనే ఆందుబాటులో లేని ప్రాంతాల నుండి ఉగ్రవాదులు నాలుగు టాక్సీ లలో వచ్చారని, వారినెవ్వరు ఆపలేదని, వారు తాజ్ హోటల్ కు చేరినప్పుడు అక్కడే రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి వారికి స్వాగతం చెప్పడానికా అన్నట్లు ఉన్నారని అంటూ 160 మందిని చంపివేసినా ఆమెకు చిన్న గాయం కూడా కాలెడినాయి విస్మయం వ్యక్తం చేశారు. 

అదృష్టవశాత్తు ఉగ్రవాది కసబ్ పట్టుబడ్డారని, లేనిపక్షంతో ఇదంతా `హిందూ ఉగ్రవాదుల' కుట్ర అనే ప్రచారం చేసేవారని మణి ఆరోపించారు. స్థానిక వ్యక్తులు తమకు సహకారం అందించారని కసబ్ చెప్పినా ఆ దిశలో దర్యాప్తు జారగానే లేదని, స్థానికంగా ఎవ్వరిని పట్టుకోలేదని వివరించారు. 

ఉగ్రవాదుల కదలికలను సముద్రమార్గంలో నావికాదళం కనిపెట్టిన్నట్లు అప్పటి హోమ్ మంత్రి చిదంబరం 2008 డిసెంబర్ 10న లోక్ సభలో చెప్పారని గుర్తు చేస్తూ ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టిన నావికాదళాన్ని అప్రమత్తమై ఉగ్రవాదులు దేశంలో ప్రవేశింపకుండా కట్టడి చేసింది రాజకీయ నాయకత్వం కాదా అని ప్రశ్నించారు.