జార్ఖండ్‌లో బీజేపికి 45-48 సీట్లు !

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 45-48 సీట్లు వస్తాయని పార్టీ సర్వేలో వెల్లడైంది. సీఎం రఘువర్ దాస్ నేతృత్వంలో తిరిగి రెండోసారి పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని ఒక సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. 

అంతేకాకుండా గతంలో కంటే ఈసారి ఓటుబ్యాంకు కూడా పెరిగే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. గతంలో బీజేపీ 31 శాతం ఉండగా, ఈసారి మాత్రం ఏకంగా 42 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ ఫలితాలు ఎలా వస్తాయన్న అంశంపై అధికార బీజేపీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు జార్ఖండ్ ముక్తిమోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 27-30 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. 

ఈ సర్వేపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ.. సీఎం రఘువర్ దాస్ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందించామని, ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.